రామకృష్ణ మఠంలో వ్యక్తిత్వ వికాస తరగతులు

ABN , First Publish Date - 2021-08-22T02:40:00+05:30 IST

హైదరాబాద్: రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ వివిధ శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది.

రామకృష్ణ మఠంలో వ్యక్తిత్వ వికాస తరగతులు

హైదరాబాద్: రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ వివిధ శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. అందులో భాగంగా వ్యక్తిత్వ వికాస తరగతులకు సంబంధించి తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో వర్చువల్ క్లాసులను మాత్రమే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 


వ్యక్తిత్వ వికాస తరగతులు ఆగస్ట్ 23 నుంచి ఆగస్ట్ 27 వరకు జరగనున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6.15 గంటల నుంచి 7.30 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. వయో పరిమితి 16 - 50 ఏళ్లు.


మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

Updated Date - 2021-08-22T02:40:00+05:30 IST