సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-20T16:45:39+05:30 IST
ఉద్యోగం పోయిందన్న బాధలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగ్ పోలీసులు కథనం ప్రకారం...

హైదరాబాద్/నార్సింగ్: ఉద్యోగం పోయిందన్న బాధలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగ్ పోలీసులు కథనం ప్రకారం... కర్నూల్‌కు చెందిన సంజీవ్(32) గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి. హైదరాబాద్‌కు చెందిన దివ్య అగర్వాల్‌ను గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. నెల రోజులు హాయిగా కాలం గడిచినప్పటికీ, ఈ ఏడాది జనవరిలో సంజీవ్ ఉద్యోగం పోయింది. కరోనా సమయం కావడంతో మరెక్కడ ఉద్యోగం లభించలేదు. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న సంజీవ్ అలాగే కాలం గడుపుతూ వస్తున్నాడు. మంగళవారం తన పక్క బెడ్‌రూంలో ఉరేసుకున్నాడు. తెల్లవారు జామున భార్యలేచి చూసి, బంధువులకు, పోలీసులకు సమాచారం అందించింది. నార్సింగ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.