Hyderabad: ముగ్గురి అదృశ్యం

ABN , First Publish Date - 2021-12-19T17:47:10+05:30 IST

అల్మా్‌సగూడ వినాయకహిల్స్‌లో నివాసముండే ఎ.మోనిక తల్లి పదేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి కూతరు, తండ్రి కాట్రావత్‌

Hyderabad: ముగ్గురి అదృశ్యం

వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యమయ్యారు. వినాయకహిల్స్‌లో ఒకరు, జిల్లెలగూడలో మరొకరు, కొహెడా నవోదయ కాలనీలో వివాహిత. మీర్‌ పేట, హయత్‌నగర్‌ పీఎస్‌ల పరిధుల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి.


హైదరాబాద్/సరూర్‌నగర్‌: అల్మా్‌సగూడ వినాయకహిల్స్‌లో నివాసముండే ఎ.మోనిక తల్లి పదేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి కూతరు, తండ్రి కాట్రావత్‌ జంగు(45) ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జంగు ఆటోతో బయటకు వెళ్లి 10, 15 రోజులకోసారి ఇంటికి వచ్చి వెళ్తుంటాడు.  ఈసారీ రెండు నెలల క్రితం బయటకు వెళ్లిన జంగు తిరిగి రాలేదు.  సెల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుండడంతో కుమార్తె మోనిక శుక్రవారం మీర్‌పేట్‌ పోలీసులను ఆశ్రయించింది. 

వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలోని సీతారాంపేట్‌కు చెందిన కె.నాగమణి కుటుంబం జిల్లెలగూడలోని ఆదర్శ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తుంది. ఆమె పెద్ద కొడుకు కె.పవన్‌కుమార్‌(45) రబ్బర్‌, గ్లాస్‌ సరఫరా చేస్తుంటాడు.  ఈనెల 9న సరుకుతో జహీరాబాద్‌ వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. పది రోజులైనా తిరిగి రాలేదు. సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుంది.  దీంతో తల్లి నాగమణి గురువారం మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

హయత్‌నగర్‌ : తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ కొహెడా గ్రామంలోని నవోదయ కాలనీకి చెందిన రాసూరి మహేష్‌ మెకానిక్‌కు  ఏడాది క్రితం అక్షర అలియాస్‌ తేజ (20)తో వివాహం జరిగింది. మహేష్‌ రోజులానే శుక్రవారం ఉదయం డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 9.30 గంటలకు ఇంటికి వచ్చి చూసే సరికి భార్య అక్షర కనిపించలేదు. దీంతో  తెలిసిన వారిని, బంధువులను విచారించినా ప్రయోజనం లేకపోయింది. శనివారం సాయంత్ర హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పై కేసులను ఎస్సై ఉదయ్‌భాస్కర్‌, ఎస్సై వెంకట్‌రెడ్డి, హయత్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-19T17:47:10+05:30 IST