కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయడం వల్లే dalitha bandhuకు అడ్డంకులు
ABN , First Publish Date - 2021-10-20T17:33:06+05:30 IST
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో దళితులు, గిరిజనులు అణచివేతకు గురవుతున్నారని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు....

హైదరాబాద్/కృష్ణానగర్ : భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో దళితులు, గిరిజనులు అణచివేతకు గురవుతున్నారని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. సోమాజిగూడలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ దళిత బంధును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయడం వల్లనే పథకానికి అడ్డంకులు ఎదురయ్యాయని ఆరోపించారు. ఎన్నికల కోడ్ రాకముందే దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి అమలు చేశారని అన్నారు. దళితుల అభివృద్ధిని అడ్డుకున్న వారు రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్‌లో దళితులు, గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, వ్యతిరేక తీర్మానాలు చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తిరుపతి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ఉమ్మడి హైదరాబాద్ ఇన్చార్జి రామచందర్, ఎంకే సంతోష్, ఉమ్మడి జిల్లా చైర్మన్ ఎం.నరేంద్రనాథ్ పాల్గొన్నారు.