9 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-20T13:46:30+05:30 IST
పేకాట ఆడుతున్న ఇంటిపై ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితోపాటు 9 మంది పేకాటరాయుళ్లను

రూ.65,170, 10 ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్/కొత్తపేట: పేకాట ఆడుతున్న ఇంటిపై ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితోపాటు 9 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి, నగదు, ఫోన్లు, ప్లాస్టిక్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగ కాలనీలోని ఓ ఇంట్లో పేకాటాడుతున్నారని సమా చారమందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. నిందితుల నుంచి రూ.65,170లు, 10 ఫోన్లు, 160 ప్లాస్టిక్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.