Omicronతో ఆందోళన అక్కర్లేదు: హైదరాబాద్ సీపీ

ABN , First Publish Date - 2021-12-15T21:32:01+05:30 IST

ఒమైక్రాన్‌ వేరియంట్‌‌తో ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు

Omicronతో ఆందోళన అక్కర్లేదు: హైదరాబాద్ సీపీ

హైదరాబాద్: ఒమైక్రాన్‌ వేరియంట్‌‌తో ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఒమైక్రాన్‌ పాజిటివ్ వచ్చిన వారిని టిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని టెస్ట్ చేసి పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని కూడా గుర్తించి టెస్ట్‌లు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-15T21:32:01+05:30 IST