నేడు తెలంగాణ హైకోర్టులో కరోనా పరిస్థితులపై విచారణ

ABN , First Publish Date - 2021-05-05T14:18:33+05:30 IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది.

నేడు తెలంగాణ హైకోర్టులో కరోనా పరిస్థితులపై విచారణ

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. కోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మే 8 వరకు తెలంగాణలో  నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఈరోజు మరోసారి హైకోర్టులో విచారణ జరుగనుంది. 

Updated Date - 2021-05-05T14:18:33+05:30 IST