చిక్కడపల్లిలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2021-05-23T13:58:22+05:30 IST
చిక్కడపల్లిలోని సుప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి ఏటా జరిగే స్వామివారి బ్రహోత్సవాలు...
భక్తులకు అనుమతి లేదు
హైదరాబాద్/చిక్కడపల్లి: చిక్కడపల్లిలోని సుప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి ఏటా జరిగే స్వామివారి బ్రహోత్సవాలు ఈనెల 24నుంచి వచ్చేనెల 1 వరకు జరుగుతాయని ఆలయ ఈవో కె.రామాంజనేయులు తెలిపారు. కరోనా, లాక్‌డౌన్ నేపఽథ్యంలో ఈ ఉత్సవాలు అంతర్గతంగా జరుగుతాయని, భక్తులకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలు ఆలయ వ్యవస్థాపక వంశీయుడైన జి.రాజేంద్రనాథ్‌గౌడ్, సువర్ణలతల కుమారుడు జి. శ్రీనాథ్‌గౌడ్, జి. కీర్తి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతాయని ఆయన వివరించారు.