హైదరాబాద్‌లో రాముడి కోసం నిధి సేకరణ కార్యక్రమం ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-20T16:11:50+05:30 IST

అయోధ్య రామమందిరం కోసం నిధి సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ బోరబండలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

హైదరాబాద్‌లో రాముడి కోసం నిధి సేకరణ కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్: అయోధ్య రామమందిరం కోసం నిధి సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ బోరబండలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ ఆధ్వర్యంలో జనజాగరణ ద్వారా నిధి సేకరణ చేయనున్నారు.  ఫ్రిబ్రవరి 10 వరకు బీజేపీ అధ్యక్షుడు ఈ నిధి సేకరణ కార్యక్రమం చేయనున్నారు. రాముడి గుడి కోసం తెలంగాణలో బండి సంజయ్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఒక్క ఇటుకైనా ఇచ్చి ప్రతీ హిందువు రామమందిరం నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-01-20T16:11:50+05:30 IST