హైదరాబాదీ.. Chicken Biryaniకి జై.. నిమిషానికి ఎన్ని Orders అంటే...!

ABN , First Publish Date - 2021-12-22T12:06:04+05:30 IST

హైదరాబాదీలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. చికెన్‌ తినేందుకు అమితాసక్తి చూపు తున్నారు.

హైదరాబాదీ.. Chicken Biryaniకి జై.. నిమిషానికి ఎన్ని Orders అంటే...!

  • చెన్నై, లక్నోలో కూడా  
  • అల్పాహారంగా మసాల దోసె, ఇడ్లీ
  • దేశంలో నిమిషానికి 115 బిర్యానీల ఆర్డర్‌

హైదరాబాద్‌ సిటీ : హైదరాబాదీలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. చికెన్‌ తినేందుకు అమితాసక్తి చూపుతున్నారు. నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన బిర్యానీకి ఎప్పటిలానే సిటీజనులు జై కొడుతున్నారు. ఆన్‌లైన్‌ ఆర్డర్లలో చికెన్‌ బిర్యానీ మొదటి స్థానంలో ఉండగా, చికెన్‌ 65 రెండో స్థానంలో నిలిచింది. పనీర్‌ బటర్‌ మసాల తృతీయ స్థానం దక్కించుకుంది. అల్పాహారంగా మసాల దోసె, ఇడ్లీ తినేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెన్నై, లక్నో, కోల్‌కతాల్లోనూ చికెన్‌ బిర్యానీకి డిమాండ్‌ అధికంగా ఉంది. 2021లో ఆహారం, సరుకుల (గ్రాసరీస్‌) కొనుగోలుకు సంబంధించిన ఆర్డర్ల వివరాలను స్విగ్గీ మంగళవారం విడుదల చేసింది.


అంశాల వారీగా దేశ వ్యాప్తంగా ఎన్ని ఆర్డర్లు వచ్చాయి, నగరాల వారీగా టాప్‌-5 ఆర్డర్ల వివరాలను వెల్లడించింది. జనవరి నుంచి డిసెంబర్‌ వరకు వచ్చిన ఆర్డర్ల ప్రామాణికంగా వివరాలు విడుదల చేస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 తరహాలోనే ఈ యేడాదిలోనూ మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌ బాటిళ్ల ఆర్డర్‌లు కొనసాగుతున్నాయని పేర్కొంది. లక్ష మాస్క్‌లు, నాలుగు లక్షల సబ్బులు, హ్యాండ్‌ వాష్‌లు ఈ సంవత్సరం ఆర్డర్‌ చేశారు. ఆరేళ్లుగా ఆర్డర్ల వివరాలు వెల్లడిస్తున్నామని, ప్రతి సంవత్సరం బిర్యానీ మొదటి స్థానంలో నిలుస్తోందని ఆ సంస్థ వెల్లడించింది. ప్రతి నిమిషానికి దేశంలో 115 బిర్యానీలు ఆర్డర్‌ అవుతున్నాయి. 2020లో నిమిషానికి 90 బిర్యానీలు ఆర్డర్‌ చేయగా.. ఈ యేడాది ఆ సంఖ్య 115కు చేరినట్లుగా పేర్కొంది.


నగరాల వారీగా టాప్‌-5 ఆర్డర్లు..

హైదరాబాద్‌  : చికెన్‌ బిర్యానీ, చికెన్‌-65, పనీర్‌ బటర్‌ మసాల, మసాల దోశ, ఇడ్లీ

చెన్నై: చికెన్‌ బిర్యానీ, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌, మటన్‌ బిర్యానీ, పనీర్‌ బటర్‌ మసాల, నెయ్యితో చేసిన పొంగల్‌

బెంగళూరు: మసాల దోశ, చికెన్‌ బిర్యానీ, పనీర్‌ బటర్‌ మసాల, నెయ్యి అన్నం, గోబి మంచూరియా 

ముంబై: దాల్‌ కిచ్‌డి, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌, పావ్‌ బాజీ, మసాల దోశ, గార్లిక్‌ బ్రెడ్‌ స్టిక్స్‌ 

ఢిల్లీ: దాల్‌ మఖానీ, వెజ్‌ పిజ్జా, అలూ టిక్కి, కిస్ర్పీ వెజ్‌ బర్గర్‌, మసాల దోశ 

లక్నో: చికెన్‌ బిర్యానీ, మసాల దోశ, మటన్‌ బిర్యానీ, కడాయి పనీర్‌, క్రిస్పీ వెజ్‌ బర్గర్‌

Updated Date - 2021-12-22T12:06:04+05:30 IST