వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం

ABN , First Publish Date - 2021-05-20T15:47:51+05:30 IST

నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యమైన సంఘనటలు చోటు చేసుకున్నాయి. కాచిగూడ పోలీసులు తెలిపిన...

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం

హైదరాబాద్/బర్కత్‌పురా: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యమైన సంఘనటలు చోటు చేసుకున్నాయి. కాచిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుషాయిగూడ చర్లపల్లి ప్రాంతానికి చెందిన శ్రీను కుమార్తె జి నవ్య (22) కాచిగూడలోని సాయికృష్ణా ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. మంగళవారం విధులకు వెళ్లిన నవ్య సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువులను ఆరా తీసినా ఎలాంటి ఫలితం రాలేదు. దాంతో ఆమె తండ్రి బుధవారం కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


బాలిక అదృశ్యం

మదీన: ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ బాలిక తిరిగిరాలేదు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. బండ్లగూడ దస్తగిరినగర్‌కు చెందిన మహ్మద్‌ ఇస్మాయీల్‌ ఖురేషీ కుమార్తె అతియా బేగం (15) స్వల్ప మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఈనెల 17న ఇంట్లో ఎవరికి ఎలాంటి సమాచారమివ్వకుండా అతియా బేగం  బయటకి వెళ్లిపోయింది.  కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు 8333900159. 040-27854763 నంబర్లలో సమాచారమివ్వాలని పోలీసులు కోరారు. 

Updated Date - 2021-05-20T15:47:51+05:30 IST