HYD: సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్

ABN , First Publish Date - 2021-08-27T13:57:17+05:30 IST

సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్‌‌లో నిలిచింది.

HYD: సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్

హైదరాబాద్: సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్‌‌లో నిలిచింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసిన పోయిన బాధితుల కోసం  కేంద్రం సెంట్రల్ సైబర్ క్రైమ్ నంబర్ 155260ను అమల్లోకి తీసుకువచ్చింది. రెండు నెలల్లో తెలంగాణ నుండి 2513 బాధితులు  సెంట్రల్ సైబర్ క్రైమ్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. సగటున రోజుకు 40 మంది బాధితులు లక్షల్లో నష్టపోతున్నారు. రెండు నెలల వ్యవధిలో తెలంగాణ బాధితుల నుండి  సైబర్ నేరగాళ్లు  దాదాపు రూ.24 కోట్లు కాజేశారు. అత్యధికంగా సైబరాబాద్ నుండి 1047  మంది  బాధితులు సైబర్ నేరగాళ్లు చేతిలో మోసపోయారు. హైదరాబాద్, రాచకొండ నుండి 358,359 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి  749 మంది  బాధితులు సైబర్ నేరాల వల్ల మోసపోయినట్టు ఫిర్యాదులు చేశారు.


Updated Date - 2021-08-27T13:57:17+05:30 IST