గోల్కొండ పోలుసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2021-05-21T17:48:33+05:30 IST

రోడ్లపైకి వస్తున్న వాహనదారుల పట్ల గోల్కొండ పోలుసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

గోల్కొండ పోలుసుల అత్యుత్సాహం

హైదరాబాద్: రోడ్లపైకి వస్తున్న వాహనదారుల పట్ల గోల్కొండ పోలుసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనదారుల పట్ల పోలీసులు దురుసుగా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులకు అనుమతి ఉన్నా కూడా వాహనం సీజ్ చేస్తామని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదరింపులకు పాల్పడుతున్నారు. జర్నలిస్టులపై పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఏకవచనంతో మాట్లాడుతూ నోటికి వచ్చినట్లు దురుగా ప్రవర్తిస్తున్నారు. పోలుసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటే .. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ పోలీసులు బెదరింపులకు పాల్పడుతున్నారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2021-05-21T17:48:33+05:30 IST