అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల జిల్లా రైతుల యత్నం
ABN , First Publish Date - 2021-03-24T16:46:06+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల జిల్లా రైతులు యత్నించారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం ఉదయం అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల జిల్లా రైతులు యత్నించారు. ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, అసెంబ్లీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీపై తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముట్టడికి యత్నించిన వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.