అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న సందిగ్ధత
ABN , First Publish Date - 2021-01-20T15:59:04+05:30 IST
బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది.

హైదరాబాద్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. సెషన్స్ కోర్టులో మరోసారి అఖిల ప్రియ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. నేడు అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సెషన్స్ కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. జగత్ విఖ్యాత్ రెడ్డి ధాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు సికింద్రాబాద్ కోర్ట్ విచారించనుంది. ఇదే కేసులో ఇద్దరు నిందితులను బోయినపల్లి పోలీసులు నేడు పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. అఖిల ప్రియ పర్సనల్ అస్సిటెంట్స్ సంపత్, మల్లికార్జున్ రెడ్డిలను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. వారిద్దరినీ చంచల్ గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకొని బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు.