హెచ్‌సీయూ భూములు ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం

ABN , First Publish Date - 2021-01-13T06:58:07+05:30 IST

హెచ్‌సీయూ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని వర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో మండిపడింది.

హెచ్‌సీయూ భూములు ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం

గచ్చిబౌలి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): హెచ్‌సీయూ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని వర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో మండిపడింది. వర్సిటీ స్థలం నుంచి టీఎన్‌జీవో కాలనీకి, ఓ సంస్థకు అనుకూలంగా అవసరం లేకపోయినా వంద అడుగుల రోడ్డు వేయడాన్ని టీచర్స్‌ అసోసియేషన్‌ తప్పుపట్టింది. మంగళవారం అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్‌ పిల్లలమర్రి రాములు, దుర్గాభవానీ సంయుక్త ప్రకటనలు విడుదల చేశారు. ఈ ప్రకటనను సీఎం కేసీఆర్‌కు పంపినట్లు వారు తెలిపారు. వర్సిటీ భూములను కబ్జాచేయడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులు అడ్డుకునేందుకు వెళితే అరెస్టు చేసి కేసులు నమోదు చేయడాన్ని వారు వ్యతిరేకించారు.  కేసులను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.  


Updated Date - 2021-01-13T06:58:07+05:30 IST