ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి
ABN , First Publish Date - 2021-05-09T04:40:12+05:30 IST
ప్రజల భాగస్వామ్యంతోనే కొవిడ్ ప్రబలకుండా చూడగలమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): ప్రజల భాగస్వామ్యంతోనే కొవిడ్ ప్రబలకుండా చూడగలమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా ప్రజలను చైతన్యపరిచేందుకు రెడ్‌క్రాస్ సొసైటీ తన వంతు పాత్రను పోషించాలని కోరారు. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా శనివారం ఆమె పుదుచ్చేరి రాజ్‌నివాస్ నుంచి సొసైటీ తెలంగాణ రాష్ట్ర, జిల్లాల ప్రతినిధులతో ఆమె వర్చువల్ కాన్ఫరెన్స్ విధానంలో చర్చించారు. కరోనా సంక్షోభ సమయంలో రెడ్‌క్రాస్ వలంటీర్లు చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరువలేనివన్నారు. కొవిడ్ రెండో దశ తీవ్రంగా ఉన్నందున సేవా కార్యక్రమాలు ముమ్మరం చేసి, నిస్సహాయులకు అండగా నిలవాలన్నారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు దేశాయి ప్రకా్‌షరెడ్డి, కటికనేని మదన్ మోహ న్‌రావు, తదితరులు పాల్గొన్నారు.