గోరటి వెంకన్నకు టీయూడబ్ల్యూజే అభినందనలు

ABN , First Publish Date - 2021-12-31T03:14:59+05:30 IST

ప్రముఖ కవి, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ ఇన్ జర్నలిస్ట్స్ సంఘం అభినందనలు..

గోరటి వెంకన్నకు టీయూడబ్ల్యూజే అభినందనలు

హైదరాబాద్: ప్రముఖ కవి, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ ఇన్ జర్నలిస్ట్స్ సంఘం అభినందనలు తెలిపింది. ఈ పురస్కారం వెంకన్నకు దక్కడం పట్ల  యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు  సయ్యద్ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, టియుడబ్ల్యూజె, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు యోగానంద్, ప్రధాన కార్యదర్శి నవీన్, లు హర్షం వ్యక్తం చేశారు. గోరటి వెంకన్నకు వారు శుభాకాంక్షలు తెలిపారు. ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం గొప్ప విషయమన్నారు. దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలను సామాజిక తాత్వికతతో కళ్లకు కట్టినట్టు వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని వారు అన్నారు. మానవ జీవితానికి, ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని.. మనిషికి, ఇతర జీవాలకు ఉన్న అనుబంధాన్ని గోరటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని వారు కొనియాడారు.

Updated Date - 2021-12-31T03:14:59+05:30 IST