సందర్శకులు రావద్దు ప్లీజ్‌..

ABN , First Publish Date - 2021-07-24T06:07:41+05:30 IST

జంట జలాశయాలు

సందర్శకులు రావద్దు ప్లీజ్‌..
ఆర్‌. సంజయ్‌కుమార్‌

నార్సింగ్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జంట జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుందని గ్రహించిన పోలీసులు గండిపేట, హిమాయతసాగర్‌లలో ప్రత్యేక పికెట్‌లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌ ఏసీపీ ఆర్‌.సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ సందర్శకులు ఎవరూ హిమాయతసాగర్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరు వచ్చినా కట్టపైకి అనుమతించమని, ఇక్కడకు వచ్చి ఇబ్బందులపాలు కావొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జలాశయం కట్టతో పాటు పరిసర ప్రాంతాల్లో బందోబస్తు కొనసాగుతుందని చెప్పారు.

Updated Date - 2021-07-24T06:07:41+05:30 IST