గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదంపై మంత్రి తలసాని స్పందన

ABN , First Publish Date - 2021-10-20T16:07:47+05:30 IST

సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు, పాడి, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదంపై మంత్రి తలసాని స్పందన

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదంపై  రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు, పాడి, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.  గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను హుజురాబాద్ ఎలక్షన్ క్యాంపింగ్‌లో ఉన్నానని ఆస్పత్రిలో  పేదల వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.  ప్రభుత్వం ఎప్పుడు వైద్య సేవలకు పూర్తి సహకారాన్ని అందిస్తుందన్నారు.  తాను హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని మంత్రి తలసాని ఫోన్లో మాట్లాడారు.

Updated Date - 2021-10-20T16:07:47+05:30 IST