తాగునీటి పథకంపై ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-07-24T05:54:27+05:30 IST

తాగునీటి పథకాన్ని

తాగునీటి పథకంపై ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే

చిక్కడపల్లి, జూలై 23(ఆంధ్రజ్యోతి): నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ సూచించారు. వచ్చేనెల 15లోగా ప్రతి వినియోగదారుడు తమ ఆధార్‌కార్డును నల్లా కనెక్షన్‌తో లింక్‌ చేసుకోవాలన్నారు. శుక్రవారం గాంధీనగర్‌ డివిజనలోని టీఆర్‌టీ కమ్యూనిటీహాల్‌లో వాటర్‌బోర్డ్‌ అఽధికారులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజలతో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లు తాగునీటి పథకం గురించి ప్రచారం చేయాలన్నారు. వచ్చేనెల 15వ తేదీలోపు నమోదు చేసుకోనట్లయితే వారికి గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఆగస్టు 31వరకు 9 నెలల బిల్లు వస్తుందన్నారు. ఈ విషయాలు స్పష్టం చేస్తూ మంచినీటి వినియోగదారులు తప్పకుండా మీటర్‌ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఆధార్‌ను అనుసంధానం చేయించాలని సూచించారు. వాటర్‌బోర్డ్‌ అధికారులు కూడా ఈ పథకం గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. వాటర్‌బోర్డ్‌ అధికారులు బస్తీలు, కాలనీలవద్దకు వచ్చినట్లయితే ప్రజలతో అప్పటికప్పుడే ఆధార్‌ నమోదు చేయించేవిధంగా చూస్తామని, ఇందుకు వాటర్‌బోర్డ్‌ అధికారులు సహకరించాలని కార్పొరేటర్లు కోరారు. ఈ విషయం పరిశీలిస్తామని వాటర్‌ బోర్డ్‌ జీఎం సుబ్బారాయుడు, డీజీఎం చంద్రశేఖర్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకులు నరేష్‌, జైసింహ, ఎర్రం శ్రీనివా్‌సగుప్తా పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T05:54:27+05:30 IST