ఆ నలుగురూ Congress కు గుడ్ బై చెప్పి.. TRS లోకి.. కేడర్‌లో పెరుగుతున్న అసహనం!

ABN , First Publish Date - 2021-08-20T14:11:23+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడు లేకపోవడంతో కేడర్‌లో అసహనం పెరుగుతోంది. వీలైనంత త్వరగా..

ఆ నలుగురూ Congress కు గుడ్ బై చెప్పి.. TRS లోకి.. కేడర్‌లో పెరుగుతున్న అసహనం!

  • జవహర్‌నగర్‌లో కాంగ్రెస్‌ పట్టు సాధించేనా?
  • ఉనికికోసం ఆరాటం.. కేడర్‌లో పెరుగుతున్న అసహనం

హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్‌ : జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో ఉన్న నలుగురు కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో ఖాళీ అయింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్‌ సహా కాంగ్రెస్‌ కార్పొరేటర్లు కుతాడీసాయి, ప్రేమలశ్రీనివాస్‌, బల్లిరోజా శ్రీనివాస్‌, జమాల్‌పూర్‌ నవీన్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరడంతో పాలకవర్గంలో ప్రతిపక్షమే లేకుండాపోయింది. జవహర్‌నగర్‌ గ్రామ పంచాయతీ హయాంలో కాంగ్రెస్‌ హవా కొనసాగింది. టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న మెజార్టీ నాయకులు కాంగ్రె‌స్‌నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.


మేడ్చల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ కో-ఆర్డినేటర్లుగా తోటకూర జంగయ్యయాదవ్‌ మరియు హరివర్థన్‌రెడ్డి కొనసాగుతున్నారు. ప్రసాద్‌గౌడ్‌, సదానంద్‌, రాజుయాదవ్‌, శ్రీకాంత్‌యాదవ్‌తో పాటు పలువురు కాంగ్రె‌స్‌కు పూర్వవైభవం కోసం కృషిచేస్తున్నారు. జవహర్‌నగర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడు లేకపోవడంతో కేడర్‌లో అసహనం పెరుగుతోంది. వీలైనంత త్వరగా కాంగ్రెస్‌ కమిటీలు వేయకుంటే  పార్టీకి తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2021-08-20T14:11:23+05:30 IST