ఫుట్‌పాత్‌పై పార్క్‌ చేసిన కారు దగ్ధం

ABN , First Publish Date - 2021-01-18T06:13:39+05:30 IST

అమీర్‌పేటలో పార్క్‌ చేసిన పాత కారు దగ్ధమైంది. ధరంకరం రోడ్డులో ఫుట్‌పాత్‌పై నాలుగేళ్లుగా ఓ కారును గుర్తుతెలియని వ్యక్తులు పార్క్‌ చేశారు.

ఫుట్‌పాత్‌పై పార్క్‌ చేసిన కారు దగ్ధం

అమీర్‌పేట, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అమీర్‌పేటలో పార్క్‌ చేసిన పాత కారు దగ్ధమైంది. ధరంకరం రోడ్డులో ఫుట్‌పాత్‌పై నాలుగేళ్లుగా ఓ కారును గుర్తుతెలియని వ్యక్తులు పార్క్‌ చేశారు. ఆదివారం సాయంత్రం కారులో నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సనత్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. 

Updated Date - 2021-01-18T06:13:39+05:30 IST