వృద్ధాశ్రమానికి నిత్యావసరాల సాయం

ABN , First Publish Date - 2021-05-20T20:52:40+05:30 IST

కోవిడ్ సెకెండ్ వేవ్‌ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమందిని బంజారా మహిళా ఎన్జీవో ద్వారా డాక్టర్ ఆనంద్ కుమార్ ఆదుకుంటున్నారు.

వృద్ధాశ్రమానికి నిత్యావసరాల సాయం

హైదరాబాద్: కోవిడ్ సెకెండ్ వేవ్‌ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమందిని బంజారా మహిళా ఎన్జీవో ద్వారా డాక్టర్ ఆనంద్ కుమార్ ఆదుకుంటున్నారు. ఇప్పటికే వలస కార్మికులకు నిత్యావసర సరుకులను అందించిన ఆనంద్ తాజాగా రాంపల్లిలోని వృద్ధాశ్రమానికి అండగా నిలిచారు. తన మిత్రులు అనిల్ రమావత్, హర్షితల సాయంతో వృద్ధాశ్రమానికి నిత్యావసర వస్తువులను అందించారు.


డాక్టర్ ఆనంద్ సినీ రంగంపై ఉన్న మక్కువతో దర్శకుడిగా మారి సామాజిక స్ఫూర్తినిచ్చే లఘు చిత్రాలను రూపొందించి అవార్డులు అందుకున్నారు. గత ఏడాది కరోనా వల్ల ఇబ్బందులు పడ్డ ఎంతోమందికి తన బంజారా మహిళా ఎన్జీవో ద్వారా సాయం చేశారు. ఇప్పుడు కూడా కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నవారికి తనకు తోచిన సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆనంద్ సేవల గురించి తెలుసుకున్న ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సాయంలో పాలు పంచుకుంటున్నారు. ఈ కరోనా కష్ట కాలంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సాయం అందించాలని ఆనంద్ కోరుతున్నారు.Updated Date - 2021-05-20T20:52:40+05:30 IST