నేడు విద్యుత్‌ సరఫరా ఉండని ప్రాంతాలు

ABN , First Publish Date - 2021-02-06T06:02:53+05:30 IST

నిజాంపేట్‌ 33/11కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి11కేవీ రాజధాని ఫీడర్‌ల పరిధిలో శనివారం ఉదయం 10గంటల నుంచి

నేడు విద్యుత్‌ సరఫరా ఉండని ప్రాంతాలు

నిజాంపేట్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): నిజాంపేట్‌ 33/11కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి11కేవీ రాజధాని ఫీడర్‌ల పరిధిలో శనివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, 11కేవీ భవ్యాస్‌ ఆనంద్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏఈ సతీష్‌ తెలిపారు. 

సెయింటాన్స్‌ 11కేవీ ఫీడర్‌ పరిధిలో..

పేట్‌బషీరాబాద్‌: సెయింటాన్స్‌, సన్‌మాన్‌బెల్‌మాన్‌ 11కేవీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయ 9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

నానక్‌రాంగూడ సబ్‌స్టేషన్‌ పరిధిలో...

రాయదుర్గం: నానక్‌రాంగూడ 33/11కేవీ సబ్‌స్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం 11నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, ఏపీహెచ్‌బీ 11కేవీ పరిధిలో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ సతీ్‌షకుమార్‌ తెలిపారు.

జవహర్‌నవోదయ ఫీడర్‌ పరిధిలో..

చందానగర్‌: జవహర్‌నవోదయ ఫీడర్‌ పరిధిలో శనివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు, రైల్వేవిహార్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యుత్‌  సరఫరా ఉండదని ఏఈ రవిచంద్ర తెలిపారు.

Updated Date - 2021-02-06T06:02:53+05:30 IST