డిజైనర్ దీప్తి గణేష్ ఆద్వ‌ర్యంలో ది లెగసీ ఆఫ్ ఇండియన్ వీవ్ ప్ర‌ద‌ర్శ‌న‌

ABN , First Publish Date - 2021-12-20T04:11:42+05:30 IST

ప్ర‌ద‌ర్శ‌న‌ ఈ నెల 26న చెన్నైలో నిర్వ‌హించే మ‌ద్రాస్ బ్రైడల్ ఫ్యాష‌న్ వీక్‌లో ప్ర‌ముక డిజైన‌ర్ దీప్తి గ‌ణేష్ ఆధ్వ‌ర్యంలో

డిజైనర్ దీప్తి గణేష్ ఆద్వ‌ర్యంలో ది లెగసీ ఆఫ్ ఇండియన్ వీవ్ ప్ర‌ద‌ర్శ‌న‌

ఈ నెల 26న చెన్నైలో నిర్వ‌హించే మ‌ద్రాస్ బ్రైడల్  ఫ్యాష‌న్ వీక్‌లో ప్ర‌ముక డిజైన‌ర్ దీప్తి గ‌ణేష్ ఆధ్వ‌ర్యంలో ది లెగ‌సీ ఆఫ్ ఇండియ‌న్ వీవ్  పేరుతో రూపొందించిన డిజైన‌ర్ దుస్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. అత్తారింటికి దారేది సినిమా ఫేం ప్ర‌ణీత ఈ ప్ర‌దర్శ‌న‌లో ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలువ‌నున్నారు. సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబించేలా, స‌రికొత్త‌దనాన్ని జోడించి రూపొందించిన విభిన్న రీతుల‌తో కూడిన డిజైన్ల‌ను షోస్టాప‌ర్‌గా నిలిచి మిగిలిన మోడ‌ల్స్‌తో క‌లిసి ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని దీప్తి లేబుల్ దీప్తి గణేష్ డాట్ కం పోర్టల్ లో విలేకరుల సమావేశంలో  దీప్తి గ‌ణేష్ మాట్లాడుతూ.. సంప్ర‌దాయ చేనేత కార్మికులు చేతితో రూపొందించిన వాటిని నా డిజైన్ల‌కు ప్ర‌త్యేకంగా ఉప‌యోగిస్తున్నాను. వాటికి క్లాసిక్ లుక్స్ తీసుకొచ్చి నేటి త‌రానికి, కొత్త‌ద‌నానికి స్వాగ‌తం ప‌లుకుతూ రూపొందిస్తున్నాను. నేటి యువ‌త ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా నా డిజైన్లు ప్ర‌తిబింబిస్తాయి. మారుతున్న కాలానికి, అభిరుచికి త‌గ్గ‌ట్టుగా డిజైన్ చేయ‌డం వ‌ల్ల‌నే విజ‌యాన్ని సాధించే వీలుంటుంది.


దీప్తి గ‌ణేష్ గురించి..

దీప్తి గ‌ణేష్ ప్ర‌ముక సెల‌బ్రిటీ డిజైన‌ర్‌. దీప్తి గ‌ణేష్ పేరు మీద ఉన్న లేబుల్ దుస్తుల‌కు ఒక ప్ర‌త్యేకత‌ ఉంది. ప్ర‌ముక సినీన‌టులు త‌మ‌న్నా, రాశి ఖన్నా, సుమ కనకాల, రోజ, జయసుధ తదితరులకు ఆమె డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. చేనేత కార్మికుల‌కు అండ‌గా నిల‌వ‌డంతోపాటు వారి ఉన్న‌తికి తోడ్ప‌డేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగ‌మ‌వుతున్నారు. మ‌న సంప్ర‌దాయాల‌కు, సంస్కృతికి పెద్ద‌పీట వేస్తూ ఆధునిక‌త‌ను జోడించేలా ఆమె డిజైన్ల‌న్ని ఉంటాయి.

Updated Date - 2021-12-20T04:11:42+05:30 IST