గోడౌన్‌లో పేలిన సిలిండర్.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-08-11T02:38:59+05:30 IST

హైదరాబాదు: గోడౌన్‌లో సిలిండర్ పేలిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గోడౌన్‌లో పేలిన సిలిండర్.. ఒకరి మృతి

హైదరాబాదు: గోడౌన్‌లో సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిలిండర్లలో గ్యాస్‌ను అక్రమంగా నింపుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మాన‌వ్ సింగ్ (24) అనే యువకుడు మృతి చెందాడు. మృతుడి తండ్రి నీరజ్ సింగ్ (48), తల్లి సుచిత్ర సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు డీఆర్‌డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే రాజాసింగ్, పలువురు కార్పొరేటర్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-11T02:38:59+05:30 IST