ఇల్లు చూపిస్తానని తీసుకెళ్లి అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2021-05-21T07:12:11+05:30 IST

పరిచయస్తుడని ఇంటికి వెళితే యువతిపై దాడి చేసి అత్యాచారయత్నం చేశాడో వ్యక్తి.

ఇల్లు చూపిస్తానని తీసుకెళ్లి అత్యాచారయత్నం

బంజారాహిల్స్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): పరిచయస్తుడని ఇంటికి వెళితే యువతిపై దాడి చేసి అత్యాచారయత్నం చేశాడో వ్యక్తి. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి(27) ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తూ మాదాపూర్‌లో స్నేహితులతో కలిసి ఉంటోంది. ఆమె వేరే ఇంటికోసం ప్రయత్నిస్తుండగా పేస్‌బుక్‌లో శ్రీనగర్‌ కాలనీకి చెందిన అభినవ్‌ పరిచయమయ్యాడు. యువతికి అవసరం ఉన్నప్పుడు ఆర్థికసాయం చేశాడు. ఇల్లు చూపిస్తానని ఈనెల 17వ తేదీన ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. మద్యం తాగించి అత్యాచారయత్నం చేశాడని, ప్రతిఘటించడంతో దాడి చేశాడని, సెల్‌ఫోన్‌ పగులగొట్టాడని, విషయం ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అభినవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-21T07:12:11+05:30 IST