ఆన్‌లైన్‌ వ్యాపారం.. అధిక లాభం ఆశ చూపి రూ. 7 లక్షలు మోసం

ABN , First Publish Date - 2021-05-08T06:37:38+05:30 IST

ఆన్‌లైన్‌ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని ఆశ చూపించి ఏడు లక్షల రూపాయలు కాజేసిన వారిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆన్‌లైన్‌ వ్యాపారం.. అధిక లాభం ఆశ చూపి  రూ. 7 లక్షలు మోసం

బంజారాహిల్స్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని ఆశ చూపించి ఏడు లక్షల రూపాయలు కాజేసిన వారిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందిరానగర్‌కు చెందిన సీహెచ్‌ సురే్‌షకు 2020లో సుధాకర్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తన స్నేహితుడు ఓం ప్రకాశ్‌ శ్రీవాస్తవ్‌ ట్రేడ్‌ ప్రాఫిట్‌ ఫండ్‌ పేరిట ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తున్నట్టు వివరించాడు. ఇందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించాడు. నిజమే అని నమ్మిన సురేష్‌ రూ. 7 లక్షలు ప్రకాశ్‌ శ్రీవాస్తవ్‌ ఖాతాలో జమచేశాడు. డబ్బు తీసుకున్నప్పటి నుంచి శ్రీవాస్తవ్‌ స్పందించడం లేదు. డబ్బు తిరిగి ఇవ్వమని సురేష్‌ అడగా ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. మోసపోయానని గ్రహంచిన సురేష్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి సైబర్‌ సెల్‌కు బదిలీ చేశారు. 


Updated Date - 2021-05-08T06:37:38+05:30 IST