ఖరీదైన కారుపై కన్నేసి కాజేశాడు
ABN , First Publish Date - 2021-02-26T05:58:29+05:30 IST
డ్రైవర్‌గా చేరాడు. యజమానికి చెందిన ఖరీదైన కారుపై కన్నేశాడు. దాన్ని చోరీ చేసి పోలీసులకు చిక్కాడు.

బంజారాహిల్స్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): డ్రైవర్‌గా చేరాడు. యజమానికి చెందిన ఖరీదైన కారుపై కన్నేశాడు. దాన్ని చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12కు చెందిన మధుసూదన్ కుకాని మంజుశ్రీ పాలిమర్స్ సంస్థ ఎండీ. ఆయన 2019లో గుండప్ప అనే వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. మధుసూదన్ ఎప్పుడూ ఫార్చూనర్, క్రూజ్ వాహనాల్లో తిరుగుతుంటాడు. ఖరీదైన బీఎండబ్ల్యూ కారు మాత్రం ఇంటి వద్దనే ఉంటుంది. ఆ వాహనంపై కన్నేసిన గుండప్ప ఈనెల 23న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కారును చోరీ చేశాడు. గమనించిన మధుసూదన్ కుమారుడు విషయాన్ని తండ్రికి చెప్పగా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గుండప్ప ఇందిరానగర్ గ్రీన్ బావర్చి వద్ద ఉండగా అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు.