నచ్చచెప్పడానికి వెళ్లిన వ్యక్తిపై యువకుడి దాడి..

ABN , First Publish Date - 2021-02-01T06:37:32+05:30 IST

వివాహితను తన ఇంట్లో ఉంచిన వ్యక్తికి సర్ధిచెప్పేందుకు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన వ్యక్తిపై దాడి చేసి, హత్య చేసిన సంఘటన

నచ్చచెప్పడానికి వెళ్లిన వ్యక్తిపై యువకుడి దాడి..

చికిత్స పొందుతూ మృతి


పంజాగుట్ట, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వివాహితను తన ఇంట్లో ఉంచిన వ్యక్తికి సర్ధిచెప్పేందుకు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన వ్యక్తిపై దాడి చేసి, హత్య చేసిన సంఘటన బేగంపేటలోని కుందన్‌ బాగ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఇండోర్‌లో గత సంవత్సరం డిసెంబర్‌ 31న వివాహిత కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు అక్కడి పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి, ఆమె హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌లో ఉన్నట్లు ఈ నెల 27న గుర్తించారు. దీంతో ఆమె భర్త నగరానికి వచ్చాడు. ఆమెతో మాట్లాడడానికి ఆమె తల్లిదండ్రులను తమ సమీప బంధువు వేదంతశుక్లాను, అతని తండ్రి విశ్వసుందర్‌ శుక్లాను తీసుకుని 29న కుందన్‌ బాగ్‌కు వచ్చాడు. అందరూ కలిసి ఆ వివాహిత ఉంటున్న యోగేష్‌ అట్టల్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతుండగా యోగేష్‌ వారితో ఘర్షణకు దిగాడు. యోగేష్‌ విశ్వసుందర్‌ ముఖంపై బలంగా కొట్టాడు. గాయాలు కావడంతో వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం విశ్వసుందర్‌ శుక్లా మృతి చెందాడు. మృతుని కుమారుడు వేదంత శుక్లా ఫిర్యాదు మేరకు యోగే్‌షపై మర్డర్‌ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న యోగే్‌షను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Updated Date - 2021-02-01T06:37:32+05:30 IST