ప్రయాణికుడి ఫిర్యాదు...కండక్టర్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-01-20T07:57:36+05:30 IST

వేరే రాష్ట్రం నుంచి నగరానికి పనిమీద వచ్చిన అజిత్‌ సింగ్‌ అనే ప్రయాణికుడు గత నెల 30న సికింద్రాబాద్‌ నుంచి అమీర్‌పేట వెళ్లే బస్సు ఎక్కాడు.

ప్రయాణికుడి ఫిర్యాదు...కండక్టర్‌ సస్పెన్షన్‌


హైదరాబాద్‌ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): వేరే రాష్ట్రం నుంచి నగరానికి పనిమీద వచ్చిన అజిత్‌ సింగ్‌ అనే ప్రయాణికుడు గత నెల 30న సికింద్రాబాద్‌ నుంచి అమీర్‌పేట వెళ్లే బస్సు ఎక్కాడు. టికెట్‌ కోసం మహిళా కండక్టర్‌కు రూ. 50 ఇచ్చాడు. అతడికి రూ. 20 ఇవ్వాల్సి ఉండగా.. ఆ విషయం టికెట్‌ వెనుక కండక్టర్‌ రాసి ఇచ్చారు. తాను దిగాల్సిన స్జేజీ వచ్చినప్పుడు చిల్లర ఇవ్వాలని అజిత్‌ తన మాతృభాషలో కోరాడు. కండక్టర్‌, ‘తెలుగులో చెప్పు.. నాకు అర్థం కావడం లేదు.. తెలుగు రాకపోతే.. తెలంగాణకు ఎందుకొచ్చినవ్‌’ అన్నారు అని అజిత్‌సింగ్‌ రాణిగంజ్‌-2 డిపోలో ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపిన అధికారులు, కండక్టర్‌ను సస్పెండ్‌ చేశారు.

Updated Date - 2021-01-20T07:57:36+05:30 IST