చీటింగ్‌ కేసులో వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2021-01-12T07:29:57+05:30 IST

వ్యాపార భాగస్వామిని మోసగించడంతోపాటు ఆదాయపన్ను రిటర్న్స్‌ విషయంలో కూడా అవకతవకలకు పాల్పడిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

చీటింగ్‌ కేసులో వ్యక్తి అరెస్టు

పంజాగుట్ట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): వ్యాపార భాగస్వామిని మోసగించడంతోపాటు ఆదాయపన్ను రిటర్న్స్‌ విషయంలో కూడా అవకతవకలకు పాల్పడిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మణికొండకు చెందిన మన్నె అనురాధ, కూకట్‌పల్లి మలేషియా టౌన్‌షి్‌పలో నివసిస్తున్న కె.బాలకోటేశ్వరరావు (52) 2015లో శ్రీనగర్‌ కాలనీలో ఎంకే ఎస్టేట్స్‌ ప్రారంభించారు. విశాఖపట్నంలో స్థలాల క్రయ, విక్రయాలు నిర్వహించే వారు. బాలకోటేశ్వరరావుకు 40 శాతం, మిగతాది అనురాధ భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించారు. 2016లో  90శాతం అనురాధకు, పది శాతం బాలకోటేశ్వరరావుకు భాగస్వామ్యం కల్పిస్తూ ఒప్పందం చేసుకున్నారు. నాలుగేళ్లు గడిచిన తర్వాత బాలకోటేశ్వరరావు తన వాటా కింద పెట్టిన పెట్టుబడి 60 లక్షలను మొత్తం వాడుకోడంతోపాటు సంస్థకు కొంత డబ్బు బాకీ పడ్డాడు. అనురాధను మోసగించి సంస్థకు చెందిన లక్షలాది రూపాయల విలువ చేసే స్థిరాస్తిని అతడి భార్య ఇందిరా ప్రియదర్శిని పేరిట మార్చుకున్నాడు. సంస్థకు చెందిన ఇతర స్థలాలను మరో ముగ్గురు మహిళలకు రిజిస్ట్రేషన్‌ చేశాడు. మరో ఐదుగురికి స్థలాలను విక్రయిస్తున్నట్టు అగ్రిమెంట్‌ కాగితాలు సృష్టించాడు. వీటితోపాటు అదాయపన్ను రిటర్న్స్‌ విషయంలో కూడా అనేక అవకతవకలకు పాల్పడడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు అనురాధ కొద్ది రోజుల క్రితం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలకోటేశ్వరరావు, అతడి భార్యతోపాటు ఎనిమిదిమందిపై కేసు నమోదు చేశారు. తప్పించుకు తిరుగుతున్న కోటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించామని, పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-12T07:29:57+05:30 IST