తన మార్క్ ప్రదర్శిస్తున్న CP CV Anand.. ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా..!
ABN , First Publish Date - 2021-12-30T12:10:08+05:30 IST
హైదరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ సీవీ ఆనంద్ తన మార్క్ ప్రదర్శిస్తున్నారు.

- ఆకస్మిక తనిఖీలు
- పంజాగుట్ట పోలీస్టేషన్ తనిఖీ
- పనితీరుపై సీపీ సంతృప్తి
హైదరాబాద్ సిటీ : హైదరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ సీవీ ఆనంద్ తన మార్క్ ప్రదర్శిస్తున్నారు. బుధవారం పంజాగుట్ట పోలీస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు రెండు గంటల పాటు పోలీస్టేషన్లో ఉండి అన్ని విభాగాల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్, విజిటర్స్ రూం, లంచ్ రూం, ఉమెన్ హెల్ప్ డెస్క్, పార్కింగ్‌తోపాటు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారితో పోలీసుల ప్రవర్తన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇకపై ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా పోలీస్టేషన్లను తనిఖీ చేస్తానన్నారు. దేశలోనే రెండో బెస్ట్ మోడల్ పోలీస్టేషన్‌గా ఎంపికైన పంజాగుట్ట పోలీస్టేషన్ పనితీరు బాగుందన్నారు.
పోలీస్ స్టేషన్లో 17 విభాగాలు బాగా పనిచేస్తున్నాయన్నారు. పనిభారం ఎక్కువగా ఉన్నా సిబ్బంది పనితీరు బాగుందని కితాబిచ్చారు. పోలీస్టేషన్లో ఈ ఏడాది 600 కేసులు నమోదు కాగా, ఇందులో 175 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, 45 మాత్రమే ఎన్బీడబ్ల్యూ కేసులున్నాయని అన్నారు. బందోబస్తు విధులు ఎక్కువగా ఉండటంతో సిబ్బందిపై పనిభారం పెరిగిందన్నారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ పివి గణేష్, ఇన్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
