ఫేక్‌ పాసులు తెచ్చుకున్న వారిపై చర్యలు: సీపీ అంజనీ కుమార్

ABN , First Publish Date - 2021-05-21T18:59:59+05:30 IST

నగరంలో 180 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లను పరిశీలించినట్లు చెప్పారు.

ఫేక్‌ పాసులు తెచ్చుకున్న వారిపై చర్యలు: సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్: నగరంలో 180 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లను పరిశీలించినట్లు చెప్పారు. ట్రాఫిక్ & లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా చేకింగ్స్ నిర్వహిస్తున్నారని...ఆయ చెక్‌పోస్ట్‌ల వద్ద నిన్నటి నుండి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూనే ఉందని తెలిపారు. లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలు సీజ్ చేస్తామని...తమ సిబ్బంది  కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 65కు పైగా వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రాకూడదన్నారు. ఎమర్జెన్సీ, మెడికల్, మెడిసిన్, హాస్పిటల్ వెళ్ళే వారిని, ఎసెన్షియల్ సర్వీసెస్  అనుమతిస్తున్నారని తెలిపారు. టైమ్ పాస్ కోసం పాసులు వెంట తెచ్చుకున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు.

Updated Date - 2021-05-21T18:59:59+05:30 IST