హైదరాబాద్‌లో యాచకులకు కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2021-05-30T13:25:04+05:30 IST

రోడ్డుపై బ్రతుకులీడుస్తున్న యాచకులకు కరోనా పరీక్షలు చేయించి..

హైదరాబాద్‌లో యాచకులకు కరోనా పరీక్షలు

హైదరాబాద్ సిటీ/పీర్జాదీగూడ : రోడ్డుపై బ్రతుకులీడుస్తున్న యాచకులకు కరోనా పరీక్షలు చేయించి ఓల్డేజ్‌ హోమ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.ఉదయ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఎనిమిది మంది యాచకులను అదుపులోకి తీసుకొని వారికి మేడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయించారు. నెగెటివ్‌ రిపోర్టులు వచ్చిన వారందరినీ బన్సీలాల్‌పేట్‌లోని హోమ్‌ ఫర్‌ డిజేబుల్డ్‌ అండ్‌ ఏజ్డ్‌కు తరలించారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో డీడబ్ల్యూఓ జ్యోతి పద్మ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మల్లికార్జున్‌, వయో వృద్ధుల కాల్‌సెంటర్‌  14567 సిబ్బంది, పీర్జాదీగూడ మేయర్‌ జక్కా వెంకట్‌ రెడ్డి, డీఎల్‌ఎ్‌సఏ సీనియర్‌ అసిస్టెంట్‌ సీతారామ రాజు, ప్యానెల్‌ లాయర్‌ ఎన్‌. సత్యనారాయణ రెడ్డి, పారా లీగల్‌ వాలంటీర్‌ గట్టు సాయికృష్ణ, డీడబ్ల్యూఓ సిబ్బంది హనుమంతు, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-30T13:25:04+05:30 IST