కూకట్‌పల్లిలో 69 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-21T07:12:22+05:30 IST

కూకట్‌పల్లి ప్రాంతంలో గురువారం 296 కరోనా పరీక్షలు నిర్వహించ గా 69 మందికి పాజిటివ్‌ వచ్చింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో

కూకట్‌పల్లిలో 69 కరోనా కేసులు

కూకట్‌పలి, మే 20 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి ప్రాంతంలో గురువారం 296 కరోనా పరీక్షలు నిర్వహించ గా 69 మందికి పాజిటివ్‌ వచ్చింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో 70 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్‌, జగద్గిరిగుట్ట(హనుమాన్‌నగర్‌)లో 44 మందిలో 15, బాలానగర్‌లో 53 మందిలో 7, పర్వతనగర్‌లో 40 మందిలో 14, ఎల్లమ్మబండలో 34 మందిలో 9, మూసాపేటలో 25 మందిలో 0, హస్మత్‌పేటలో 30 మందిలో ఏడుగురుకి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు.


కుత్బుల్లాపూర్‌లో 29 పాజిటివ్‌ కేసులు

కుత్బుల్లాపూర్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో గురువారం 214 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కుత్బుల్లాపూర్‌ యూపీహెచ్‌సీలో 64 మందిలో 6, సూరారంలో 38 మందిలో 7, గాజులరామారంలో 50 మందికి 7, దుండిగల్‌ పీహెచ్‌సీలో 62 మందిలో 9 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆయా కేంద్రాల వైద్యాధికారులు తెలిపారు. Updated Date - 2021-05-21T07:12:22+05:30 IST