లాక్‌డౌన్‌లో కూరగాయలు అమ్మాలని కానిస్టేబుల్‌ ఒత్తిడి

ABN , First Publish Date - 2021-05-14T16:06:04+05:30 IST

లాక్‌డౌన్‌ను పగడ్బందీగా అమలు చేయాల్సిన కానిస్టేబుల్‌ దారి తప్పాడు.

లాక్‌డౌన్‌లో కూరగాయలు అమ్మాలని కానిస్టేబుల్‌ ఒత్తిడి

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యాపారి


హైదరాబాద్/బంజారాహిల్స్‌ : లాక్‌డౌన్‌ను పగడ్బందీగా అమలు చేయాల్సిన కానిస్టేబుల్‌ దారి తప్పాడు. షాపు తీసి కూరగాయలు అమ్మాలంటూ వ్యాపారిపై ఒత్తిడిచేశాడు. బంజారాహిల్స్‌ రోడ్డు నెం. 14 నందినగర్‌లో నివాసముండే మున్నాయాదవ్‌ స్థానికంగా కూరగాయల షాపు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం వ్యాపారం నిర్వహించి నిబంధనల ప్రకారం పది గంటలకు మూసి వేశాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు బంజారాహిల్స్‌రోడ్డు నెం. 10లోని పోలీసు క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ నందినగర్‌కు వచ్చాడు. షాపు తెరిచి కూరగాయలు అమ్మాలని మున్నాయాదవ్‌పై ఒత్తిడి చేశాడు. లాక్‌డౌన్‌ ఉంది.. తీయనని మున్నా చెప్పినా వినిపించుకోకుండా బెదిరించాడు. దీంతో మున్నా బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2021-05-14T16:06:04+05:30 IST