కేసీఆర్ చేతకాకుండా అయిపోయాడు..అందుకే: జీవన్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-01-22T18:59:24+05:30 IST
కేసీఆర్ చేతకాకుండా అయిపోయాడని... అందుకే కేటీఆర్‌ను సీఎం అంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు
హైదరాబాద్: కేసీఆర్ చేతకాకుండా అయిపోయాడని... అందుకే కేటీఆర్‌ను సీఎం అంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు వయస్సు మల్లిందన్నారు. ఆ కారణంతోనే కేటీఆర్‌ను తెర మీదకు తీసుకువస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌కు కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై చూపించే శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ అమలుపైన కూడా రెండేళ్ల సమయం పట్టిందని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ అంత కంటే మెరుగు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయుష్మన్ భారత్ అంటున్నారన్నారు. అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం కూడా రెండేళ్లు ఆలస్యం చేశారని... మొన్నటి ఎన్నికల్లో ఫలితాలే కారణం అయి ఉండొచ్చని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా కనువిప్పు కలిగినందుకు సంతోషమన్నారు. గిరిజన రిజర్వేషన్లు 10 శాతం కుడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. చరిత్రలో సీఎం కేసీఆర్ గిరిజన ద్రోహిగా మిగిలిపోతారన్నారు. కేసీఆర్ రాజ్యాంగ నిబంధన ఉల్లంగిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.