రైతులు టీఆర్‌ఎస్‌ను బొందపెట్టడం ఖాయం: Uttam

ABN , First Publish Date - 2021-12-28T17:29:01+05:30 IST

టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

రైతులు టీఆర్‌ఎస్‌ను బొందపెట్టడం ఖాయం: Uttam

హైదరాబాద్: టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. వందేళ్ల సింగరేణిని వేలం పెట్టడం టీఆర్ఎస్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో కనీసం నోరు విప్పలేదన్నారు. వరి పండించడం ఇవ్వాళ కొత్తకాదని, కేసీఆర్ అసమర్థత వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతులు టీఆర్ఎస్‌ను బొందపెట్టడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు. వరి వేయొద్దు అంటున్న కేసీఆర్‌కు అసలు మైండ్ ఉందా అని అన్నారు. పంటమార్పిడి అనేది సుదీర్ఘ ప్రక్రియ అని తెలిపారు. ఒకేసారి సడన్‌గా వరి వేయొద్దని చెబుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40లక్షల మెట్రిక్ టన్నుల అగ్రిమెంట్‌కు సన్నాసులు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. ఈ మంత్రులు సన్నాసులా, దద్దమ్మలా? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 


Updated Date - 2021-12-28T17:29:01+05:30 IST