జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-08-27T14:38:09+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధానా న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధానా న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘తెలంగాణ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే అమూల్యమైన తీర్పులనిచ్చి మీదైన ఒరవడిని పరిచయం చేశారు. మీ హుందాతనం, వృత్తిపట్ల మీకున్న అంకితభావం రేపటి తరానికి ఆదర్శం కావాలని, మీరు మరింత కాలం దేశానికి సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం కేసీఆర్ అన్నారు.   Updated Date - 2021-08-27T14:38:09+05:30 IST