ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

ABN , First Publish Date - 2021-05-05T06:19:50+05:30 IST

అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలో ఉన్న నగదును దొంగిలించేందుకు యత్నించారు.

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
ధ్వంసం చేసిన ఏటీఎం

అమీర్‌పేట, మే 4 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలో ఉన్న నగదును దొంగిలించేందుకు యత్నించారు. ఈ సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌పరిధిలోని వివేకానంద కమ్యూనిటీహాల్‌ సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్కంపేట ప్రధాన రహదారి సోనాబాయామ్మ ఆలయం సమీపంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏటీఎంలో డబ్బులు నింపడానికి మంగళవారం మధ్యాహ్నం 12-30 గంటలకు వచ్చిన వ్రైటర్‌ సేఫ్‌ గార్డ్స్‌ సంస్థ టీం లీడర్‌ సాయి ప్రేం ఏటీఎంను ధ్వంసం చేసి ఉండటం గుర్తించాడు. వెంటనే విషయాన్ని ఎఫ్‌ఐఎస్‌ పేమెంట్‌ సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌ సంస్థ ప్రతినిధి ప్రకా్‌షకు సమాచారం అందించాడు. వారు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చోరీకి ఏటీఎంను ధ్వంసం చేసినప్పటికీ డబ్బు సురక్షితంగానే ఉందని గుర్తించారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-05T06:19:50+05:30 IST