‘చాక్లెట్‌’ అదృశ్యంపై ఫిర్యాదు.. కనిపిస్తే Call చేయండి..!

ABN , First Publish Date - 2021-12-30T12:04:09+05:30 IST

‘చాక్లెట్‌’ అదృశ్యంపై ఫిర్యాదు.. కనిపిస్తే Call చేయండి..!

‘చాక్లెట్‌’ అదృశ్యంపై ఫిర్యాదు.. కనిపిస్తే Call చేయండి..!

హైదరాబాద్ సిటీ/అల్లాపూర్‌ : కూకట్‌పల్లి రెయిన్‌బో విస్టాస్‌లో సంచరించే ఓ వీధికుక్క వారం రోజులుగా కనిపించడం లేదు. దీంతో అక్కడి రెసిడెంట్‌ గంటి అన్నపూర్ణ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెయిన్‌బో విస్టాస్‌ అపార్ట్‌మెంట్‌లో సంచరించే వీధి కుక్కకు స్థానికులు చాక్లెట్‌ అని పేరు పెట్టుకున్నారు. దాన్ని చూసుకునేందుకు ఓ వ్యక్తిని కూడా నియమించారు. వారం రోజులుగా చాక్లెట్‌ కనిపించకపోవటంతో జంతుప్రేమికులు పలుచోట్ల వెదికినా కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఆచూకీ తెలిసిన వారు కూకట్‌పల్లి పోలీసులకు (9490617123, 8332981134, 040-27853959) సమాచారం ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2021-12-30T12:04:09+05:30 IST