సాఫ్ట్వేర్ యువతితో Instagram లో చాటింగ్.. లక్షలు దోచేశాడు..!
ABN , First Publish Date - 2021-09-09T14:54:40+05:30 IST
సాఫ్ట్వేర్ యువతితో ఆరు నెలలు చాటింగ్ చేసి
హైదరాబాద్ సిటీ : సాఫ్ట్వేర్ యువతితో ఆరు నెలలు చాటింగ్ చేసి, రూ. 17లక్షలు దోచేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగి. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఆరు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయం అ య్యాడు. ఎన్ఆర్ఐగా (అమెరికాలో) బిజినెస్ మ్యాన్‌గా పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో చాటింగ్ చేస్తూ బిజినెస్ పనిమీద జర్మని వెళ్లినట్లు చెప్పాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యానని నమ్మించి యువతి నుంచి విడతల వారీగా రూ. 17లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించి ఫోన్ స్విచాఫ్ చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన యువతి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చందానగర్ పోలీసులు రంగంలోకి దిగి సైబర్ నేరగాడికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు.