మోగింది కల్యాణ వీణ

ABN , First Publish Date - 2021-12-25T15:02:53+05:30 IST

బిల్డర్‌ నాగిరెడ్డి, సంస్కృత దంపతులు 25 ఏళ్ల తర్వాత శుక్రవారం మళ్లీ పెళ్లి పీటలెక్కారు.

మోగింది కల్యాణ వీణ

నార్సింగ్‌, డిసెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): బిల్డర్‌ నాగిరెడ్డి, సంస్కృత దంపతులు 25 ఏళ్ల తర్వాత శుక్రవారం మళ్లీ పెళ్లి పీటలెక్కారు. నాడు స్నేహితుల మధ్య భయం.. భయంగా వివాహం చేసుకున్న వారు ఈ సారి అంగరంగవైభవంగా బంధుమిత్రుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. శంషాబాద్‌లోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగిన వీరి వివాహానికి పలువురు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

Updated Date - 2021-12-25T15:02:53+05:30 IST