బోయిన్‌పల్లి పోలీస్‌‌స్టేషన్‌‌లో సంతకం చేసిన అఖిలప్రియ

ABN , First Publish Date - 2021-02-01T17:59:55+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ బోయిన్‌పల్లి పోలీస్ ‌స్టేషన్‌కు హాజరయ్యారు.

బోయిన్‌పల్లి పోలీస్‌‌స్టేషన్‌‌లో సంతకం చేసిన అఖిలప్రియ

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ బోయిన్‌పల్లి పోలీస్ ‌స్టేషన్‌కు హాజరయ్యారు. సికింద్రాబాద్ కోర్టు ఆదేశాలనుసారం బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరై బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి సమక్షంలో సంతకం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అఖిలప్రియను పోలీసులు పలు విషయాల్లో ప్రశ్నించారు. పోలీసుల విచారణకు అఖిల ప్రియ సహకరించినట్లు ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు హాజరైన అఖిలప్రియ గంటన్నరపాటు పోలీస్ స్టేషన్‌లోనే ఉండి పోలీసుల విచారణకు సహకరించినట్లు ఏసీబీ నరేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అఖిలప్రియ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేస్తుందని తెలిపారు. భార్గవ్ రామ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి వెతుకుతున్నట్లు ఎసీపీ నరేష్ రెడ్డి అన్నారు.

Updated Date - 2021-02-01T17:59:55+05:30 IST