‘తెలంగాణ ఉద్యమ సైనికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది’

ABN , First Publish Date - 2021-01-12T18:40:07+05:30 IST

తెలంగాణ ఏర్పాటుకు దహనం అయిన ఉద్యమ సైనికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు ఆరోపించారు.

‘తెలంగాణ ఉద్యమ సైనికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది’

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు దహనం అయిన ఉద్యమ సైనికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు ఆరోపించారు. మంగళవారం ఉదయం గవర్నర్‌ తమిళి సైతో భేటీ అనంతరం బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న విశ్వ విద్యాలయాలలో వీసీలు లేరని... ఉన్నత విద్యా రంగానికి ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. బీజేపీ ఒత్తిడి వల్ల రెండు విశ్వ విద్యాలయాలకు వీసీలను నియమించారన్నారన్నారు. యూనివర్సిటీలలో చాలా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. కొత్త ప్రైవేట్ విశ్వ  విద్యాలయాలు టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే అనుమతి ఇచ్చారని మురళీధర్‌రావు మండిపడ్డారు.

Updated Date - 2021-01-12T18:40:07+05:30 IST