ఓబీసీల ఫీజురీయింబర్స్‌మెంట్‌లో ఆంక్షలపై మండిపడ్డ లక్ష్మణ్

ABN , First Publish Date - 2021-01-12T18:46:30+05:30 IST

తెలంగాణలో అన్ని విశ్వ విద్యాలయాలు సిబ్బంది లేక కుప్పకూలుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు లక్ష్మణ్ అన్నారు.

ఓబీసీల ఫీజురీయింబర్స్‌మెంట్‌లో ఆంక్షలపై మండిపడ్డ లక్ష్మణ్

హైదరాబాద్: తెలంగాణలో అన్ని విశ్వ విద్యాలయాలు సిబ్బంది లేక కుప్పకూలుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం గవర్నర్ తమిళిసైతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ...కేసీఆర్ కుటుంబీకులు మాత్రం దొడ్డి దారిన పదవులు పొందుతున్నారని విమర్శించారు. ఓబీసీలకు ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌లో అనేక  ఆంక్షలు పెడుతుండటాన్ని బీజేపీ తప్పు పడుతుందని తెలిపారు. విశ్వ విద్యాలయాలలో కాంట్రాక్ట్ వ్యవస్థపై, ఇంకా విశ్వ విద్యాలయాల సమస్యపై గవర్నర్‌‌కు వివరించడం జరిగిందని...గవర్నర్ సానుకూలంగా స్పందించారని లక్ష్మణ్ అన్నారు. 

Updated Date - 2021-01-12T18:46:30+05:30 IST