వాటిని అర్ధం చేసుకోవడంలో జగన్ వైఫల్యం: Lanka dinakar

ABN , First Publish Date - 2021-12-19T17:17:14+05:30 IST

ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు అర్థం చేసుకోవడంలో ముఖ్యమంత్రి జగన్ వైఫల్యమని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.

వాటిని అర్ధం చేసుకోవడంలో జగన్ వైఫల్యం: Lanka dinakar

హైదరాబాద్: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు అర్థం చేసుకోవడంలో ముఖ్యమంత్రి జగన్ వైఫల్యమని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ & పీ.ఏం గతి శక్తి యోజన కు ప్రాధాన్యత ఇస్తుంటే, రాష్ట్రంలో మద్యం & భూములు అమ్మకానికి ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. బిల్డ్ ఏపీ అంటూ భూములు అమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం కిల్ ఏపీ విధానం అనుసరిస్తూ నీతిఆయోగ్‌ను  కోర్ట్‌లో ఇంప్లీడ్ అవ్వమని కోరితే తిరస్కరించిందన్నారు.  నగదీకరణ ద్వారా కేంద్రం భవిష్యత్తు ఆదాయం ఆర్జించే మౌలిక సదుపాయాల కల్పనకు వనరులను సమకూర్చుకుంటుంటే, భూములు అమ్మకం ద్వారా జగన్ పాలనలో వనరులను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని బలోపేత ఆర్థిక నిర్మాణం వైపు అడుగులు వేస్తుంటే, రాష్ట్రంలో ప్రభుత్వం అనుత్పాదక వ్యయంతో వనరుల నిర్వీర్యం చేస్తోందని లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2021-12-19T17:17:14+05:30 IST