Bike Taxi Rapidoతో మెట్రో ఒప్పందం..
ABN , First Publish Date - 2021-12-30T15:27:37+05:30 IST
మెట్రోరైల్ సువర్ణ ఆఫర్ను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవడం..

హైదరాబాద్ సిటీ/అమీర్పేట : మెట్రోరైల్ సువర్ణ ఆఫర్ను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవడం శుభపరిణామమని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ప్రయాణికులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు బైక్ట్యాక్సీ ర్యాపిడోతో ఒప్పందం కుదుర్చుకొన్నట్టు తెలిపారు. సువర్ణ ఆఫర్లో భాగంగా నెలవారీ పాసులు తీసుకున్న వారిలో విజేతలకు ఎన్వీఎస్ రెడ్డి అమీర్పేట మెట్రో రైల్వే స్టేషన్లో బుధవారం బహుమతులను ప్రదానం చేశారు. ఎల్ అండ్ టీ హెచ్ఎంఆర్ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి విజేతలను అభినందించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ర్యాపిడో భాగస్వామ్యం ద్వారా అనుకున్న సమయానికి గమ్యం చేరుస్తుందన్నారు. ర్యాపిడో కో ఫౌండర్ అరవింద సత్తా మాట్లాడుతూ మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు గమ్యం చేరేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎల్అండ్ టీ సీఓఓ చిప్లుంకర్ తదితరులు పాల్గొన్నారు.